లింగాష్టకం అనేది శివుడిని భక్తితో స్తుతించే చాలా ప్రసిద్ధమైన అష్టకం (ఎనిమిది శ్లోకాల స్తోత్రం). ఇందులో శివలింగాన్ని పరమశివుడి రూపంగా భావించి, ఆయన గొప్పతనాన్ని సులభంగా చెప్పుకుంటారు. మన హిందూ సంప్రదాయంలో శివలింగానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. శివపురాణం వంటి పురాణాలలో కూడా లింగారాధన ఎంతో పవిత్రమని చెప్పబడింది. అందుకే శివపూజ, అభిషేకం, శివరాత్రి వంటి సందర్భాల్లో భక్తులు శివుని ఆశీర్వాదం కోసం లింగాష్టకాన్ని తరచుగా జపిస్తారు.
Lingashtakam Lyrics Telugu English – Free PDF download
Lyrics in Telugu & English
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్ష సుయజ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదలోపరి వేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణ లింగమ్ ।
అష్ట దారిద్ర వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
Brahma Murari Surarchita Lingam
Nirmala Bhasita Shobhita Lingam
Janmaja Dukha Vinashaka Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Devamuni Pravara Archita Lingam
Kamadahana Karunakara Lingam
Ravana Darpa Vinashana Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Sarva Sugandha Sulepita Lingam
Buddhi Vivardhana Karana Lingam
Siddha Surasura Vandita Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Kanaka Mahamani Bhushita Lingam
Phanipati Veshtita Shobhita Lingam
Daksha Suyajna Vinashana Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Kunkuma Chandana Lepita Lingam
Pankaja Hara Sushobhita Lingam
Sanchita Papa Vinashana Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Devagana Archita Sevita Lingam
Bhavair Bhaktibhireva Cha Lingam
Dinakara Koti Prabhakara Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Ashta Dalopari Veshtita Lingam
Sarva Samudbhava Karana Lingam
Ashta Daridra Vinashana Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Suraguru Suravara Poojita Lingam
Suravana Pushpa Sadaarchita Lingam
Paramapadam Paramatmaka Lingam
Tat Pranamami Sada Shiva Lingam
Lingashtakam Lyrics PDF Download
భక్తుల సౌకర్యం కోసం ఈ పేజీలో మేము ఉచిత PDF డౌన్‌లోడ్ ఎంపికను అందిస్తున్నాము. ఈ PDF ద్వారా మీరు:
- ఆఫ్లైన్‌లో కూడా చదవచ్చు
- పూజ సమయంలో సులభంగా ఉపయోగించుకోవచ్చు
- రోజూ జపం కోసం సేవ్ చేసుకోవచ్చు
Watch Lingashtakam Siva Stotram Online
Frequently Asked Questions (People Also Ask)
ఆదిశంకరాచార్యులు రచించారు. ఇది శైవ భక్తిలో చాలా ముఖ్యమైన స్తోత్రంగా గుర్తింపు పొందింది.
అవును, లింగాష్టకం చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన స్తోత్రంగా భావించబడుతుంది. దీన్ని భక్తితో జపిస్తే మనసుకు శాంతి కలుగుతుంది, నెగటివ్ భావాలు తగ్గుతాయి.
అవును, ఎలాంటి సందేహం లేకుండా జపించవచ్చు. శివుడి భక్తికి ఎలాంటి భేదం లేదు. ఎవరైనసరే భక్తి శ్రద్దలతో ఈ స్తోత్రాన్ని జపించవచ్చు.
ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమి లేవు. భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడి మీద నమ్మకంతో చదవడం ముఖ్యము. ఆలయంలో లేదా ఇంట్లో శివలింగం ముందు చదివితే మరింత మంచి ఫలితం వస్తుందని అంటారు.
లింగాష్టకం జపించడానికి ఖచ్చితమైన నంబర్ అంటూ ప్రత్యేక నియమం లేదు. సాధారణంగా రోజుకు ఒకసారి లేదా 3, 11, 21 సార్లు భక్తితో జపిస్తే మంచిదని అంటారు. ముఖ్యంగా సోమవారం, ప్రదోష సమయలలో లేదా శివరాత్రి రోజుల్లో జపించడం మరింత శ్రేయస్కరం.